Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటివాడో తెలుసుకోకుండా వెళ్లొద్దండీ... శ్రీరెడ్డి పాయింట్లపై తమ్మారెడ్డి

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వున్నదంటూ ఈమధ్య నటి శ్రీరెడ్డి ఇస్తున్న ఇంటర్వ్యూలపై ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌసులలో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (19:50 IST)
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వున్నదంటూ ఈమధ్య నటి శ్రీరెడ్డి ఇస్తున్న ఇంటర్వ్యూలపై ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌసులలో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఎవరో ఇండస్ట్రీ పేరు చెప్పుకుని పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ మోసగించేవారు వుండొచ్చు. అలాంటి ప్రకటనలు గతంలో నా దృష్టికి వచ్చినప్పుడు పత్రిక యాజమాన్యాలకు ఫోన్లు చేసి వాస్తవాలు తెలుసుకుని ఆ ప్రకటనలు తీయించేసినట్లు చెప్పుకొచ్చారు. 
 
ఐతే ఈమధ్య కొంతమంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ మీద టీవీ ఛానల్స్‌కు వచ్చి మాట్లాడటాన్ని చూసాను. ఇలాంటివి నిజమేనని కూడా చాలాసార్లు చెప్పాను. ఎక్కడో ఒకరిద్దరు ఇలాంటివి చేస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం అలాగే అని మాట్లాడటం మంచిది కాదు. అలా ప్రవర్తించేవారు ఎవరో వారి పేర్లను డైరెక్టుగా చెప్పేస్తే చర్యలు తీసుకోవడం సుళువవుతుందని అన్నారు. 
 
అంతేకాని... పేర్లు చెప్పకుండా వాళ్లూ వీళ్లూ అని చెబితే ఫలితం వుండదన్నారు. అందుకే పేపర్లో నటీనటులు కావలెను అని ఎవడో ఒకడు ప్రకటన ఇస్తే వాడు ఎలాంటివాడో తెలుసుకోకుండా అలాంటి వారితో వెళ్లొద్దని సూచించారు తమ్మారెడ్డి. మరి తమ్మారెడ్డి వ్యాఖ్యలపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని కాల్చి చంపిన రిటైర్డ్ ఎస్ఐ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments