Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ రాజకీయ నేత కాదు.. ఫక్తు వ్యాపారస్తుడు : కట్టప్ప ఫైర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై మరో సీనియర్ నటుడు సత్యరాజ్ సంచలన ఆరోపణలు చేశారు. రజినీకాంత్ రాజకీయనేత కాదనీ.. ఫక్తు వ్యాపారస్తుడని చెప్పారు. ఆయన ఆధ్యాత్మిక రాజకీయ వ్యాపారం చేయనున్నారంటూ మండిపడ్డారు.

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (10:44 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై మరో సీనియర్ నటుడు సత్యరాజ్ సంచలన ఆరోపణలు చేశారు. రజినీకాంత్ రాజకీయనేత కాదనీ.. ఫక్తు వ్యాపారస్తుడని చెప్పారు. ఆయన ఆధ్యాత్మిక రాజకీయ వ్యాపారం చేయనున్నారంటూ మండిపడ్డారు.
 
ఒక సినీ హీరోగా దక్షిణ భారతదేశంలోని సినీ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన సత్యరాజ్.. "బాహుబలి" చిత్రంలో వేసిన కట్టప్ప పాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ కట్టప్ప ఇపుడు రజినీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
'రాజ‌కీయాలంటే ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా సేవ చేసే మార్గం. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకుంటే ముందు, వెన‌కా ఆలోచించ‌కూడ‌దు. కానీ, ర‌జినీ తీరు చూస్తుంటే అలా లేదు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డానికే ఆయ‌న ఎన్నో సంవ‌త్స‌రాలు తీసుకున్నారు. అన్ని లెక్క‌లూ వేసుకుని ప్ర‌వేశించ‌డానికి ఇది వ్యాపారం కాదు. బిజినెస్‌మేన్‌లు మాత్ర‌మే ప‌క్కా వ్యూహాల‌తో వ్యాపారం ప్రారంభిస్తారంటూ వ్యాఖ్యానించారు. 
 
పైగా, మన వ్యాపారం స‌జావుగా న‌డుస్తుందా? మ‌న ఉత్స‌త్తికి మార్కెట్ ఉంటుందా? వ‌ంటి అన్ని లెక్క‌లూ వేసుకుని బ‌రిలోకి దిగుతారు. రజినీ కూడా అలాంటి లెక్క‌ల‌న్నీ వేసుకుని రాజ‌కీయ అరంగేట్రం చేస్తున్నారు. ఆయ‌న చేసేది రాజ‌కీయం కాదు.. వ్యాపారం. తాను ఆధ్యాత్మిక రాజ‌కీయాలు న‌డుప‌బోతున్న‌ట్టు ర‌జినీ చెప్ప‌డం చాలా హాస్యాస్ప‌దంగా ఉంది. ఆయ‌న చేస్తోంది ఆధ్యాత్మిక వ్యాపారం. ఒక నిర్ణ‌యం తీసుకునే ముందు ప్ర‌జ‌ల అభిప్రాయ‌లు తీసుకుంటే మంచిది' అంటూ సత్యరాజ్ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments