Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

డీవీ
శుక్రవారం, 8 నవంబరు 2024 (15:31 IST)
rebel star Prabhas
KGF 1, KGF 2, సలార్ పార్ట్ 1 వంటి సినిమాతో హోంబలే విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ పార్ట్ 2తో భాగస్వామ్యం ప్రారంభమవుతుంది. హోంబాలేతో కలిసి ప్రభాస్ మరపురాని చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ హిస్టారికల్ కొలాబరేషన్ లో సలార్ పార్ట్ 2  తర్వాత, ఎడిషినల్ గా రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయి. ఇది ఇప్పటి వరకు ప్రభాస్, ప్రొడక్షన్ హౌస్ మధ్య జరిగిన లార్జెస్ట్ డీల్ సూచిస్తూ, కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
 
హోంబాలే ఫిల్మ్స్ హై-క్యాలిబర్, బిగ్గెస్ట్ స్టార్స్ తో చేసే ప్రాజెక్ట్స్ లైనప్ ని కొనసాగుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలు భారతీయ ప్రేక్షకులకు అద్భుతమైన మూవీస్ అందించాలనే హోంబాలే విజన్ పునరుద్ఘాటిస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ అద్భుతమైన కంటెంట్ తో, కమర్షియల్ గా సక్సెస్ ఫుల్ చిత్రాలకు పేరుగాంచిన విజనరీ నిర్మాణ సంస్థగా ఎదిగింది. KGF చాప్టర్ 1, KGF చాప్టర్ 2, కాంతార, సలార్ 1 ప్రపంచవ్యాప్త విజయాలతో హోంబలే అద్భుతమైన లైనప్‌ను నిర్మించింది. ఇందులో ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార 2, KGF చాప్టర్ 3 అలాగే ప్రభాస్‌తో కొత్త వెంచర్‌లు ఉన్నాయి.
 
ఇండియన్ సినిమాస్ లో అత్యంత డిమాండ్ ఉన్న సూపర్ స్టార్‌లలో ఒకరైన ప్రభాస్, హోంబలే ల్యాండ్‌మార్క్ చిత్రం సలార్ 2తో పాటు రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీతో ఎక్స్ ట్రార్డినరీ ప్రాజెక్ట్‌లను తీసుకువస్తున్నారు. హోంబలేతో మల్టీ-ఫిల్మ్స్ డీల్ భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థతో అతని గొప్ప అనుబంధాన్ని సూచిస్తోంది, హోంబాలే బ్యానర్‌లో నాలుగు చిత్రాలను హెడ్‌లైన్‌గా ఉంచింది. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ నుంచి మూడు బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్ డేట్స్ ని పొందడం ఒక రేర్ అచీవ్మెంట్, విజన్ తో కూడిన ఈ కొలాబరేషన్ ఇరువురి కాన్ఫిడెన్స్ ని నొక్కి చెబుతుంది. అన్ని పరిశ్రమలను ఏకీకృతం చేసి, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మార్కెట్‌ల నుంచి మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ ని పొందగలిగే బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్.  
 
హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ ఈ కొలాబరేషన్ పై మాట్లాడుతూ.. “హోంబాలేలో, సరిహద్దులను దాటే పవర్ అఫ్ స్టొరీ తెల్లింగ్ ని మేము విశ్వసిస్తాము. ప్రభాస్‌తో మా కొలాబరేషన్ రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే, ఎంటర్టైన్మెంట్ పంచే టైమ్‌లెస్ సినిమాలని రూపొందించే దిశగా ఒక అడుగు' అన్నారు
 
సలార్ పార్ట్ 2, కాంతార 2, KGF చాప్టర్ 3 అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో హోంబలే ఫిల్మ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా సంచలనాత్మకమైన సినిమాను రూపొందించడానికి కట్టుబడి వుంది. భారతీయ చలనచిత్రంలో హోంబాలేను ఒక పవర్‌హౌస్‌గా స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూసే, శాశ్వతమైన చిహ్నంగా ప్రభాస్ లెగసీని పటిష్టం చేసింది.
 
కన్నడలో KGF & కాంతార, తెలుగులో సాలార్, తమిళంలో రఘు తాత, మలయాళంలో ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో ధూమమ్‌తో సహా అన్ని మార్కెట్‌లలో హిట్‌ను అందించగలిగిన ఏకైక నిర్మాణ సంస్థగా హోంబలే ఫిల్మ్స్ సంచలనం సృష్టిస్తోంది.  ఇప్పుడు, ఇది నిజానికి హోంబాలే, ప్రభాస్ కలిసి బాహుబలి 1&2, KGF 2, కల్కి,  సలార్‌లతో ప్రపంచవ్యాప్తంగా 20 బిగ్గెస్ట్ హిట్స్ లో 5లో భాగమైన టైటాన్స్‌ల కొలాబరేషన్ .
 
ప్రభాస్-హోంబాలే భాగస్వామ్యం ఇండియన్ సినిమాలో కొత్త శకానికి నాంది పలికింది. ఇది న్యూ బెంచ్ మార్క్స్ ని సెట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments