Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షో నుంచి నాగ్ తప్పుకుంటున్నాడా..? (video)

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (17:09 IST)
బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3... ఈ మూడు సీజన్లు వీక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి. ఇక బిగ్ బాస్ 4 వస్తుందని తెలిసినప్పటి నుంచి ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఫస్ట్‌లో బాగానే ఉందనిపించినా.. ఆ తర్వాత ఈ షోపై ఇంట్రెస్ట్ తగ్గుతుందనే టాక్ వచ్చింది. దీనికి కారణం ఈ షోలో పాల్గొన్నవారిలో అంతగా ఆకట్టుకునే వాళ్లు లేకపోవడమే అని అందరూ చెబుతున్న మాట.
 
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షో నుంచి నాగార్జున తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఏంటి నాగార్జున హోస్ట్ చేయరా..? తప్పుకుంటున్నారా..? ఇది నిజమేనా..? అసలు ఈ వార్త వెనకున్న వాస్తవం ఏంటి అని ఆరా తీస్తే... తెలిసింది ఏంటంటే... నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
 
సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగింది. అయితే... ఈ సినిమా కోసం కొంత షూటింగ్ థాయ్‌లాండ్‌లో చేయాల్సివుంది. అప్పుడు కరోనా కారణంగా ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసారు. ఇప్పుడు కరోనా తగ్గడంతో థాయ్‌లాండ్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.
 
అయితే.. నాగార్జున థాయ్‌లాండ్ వెళ్లి వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొంటే.. మరి.. బిగ్ బాస్ హోస్ట్‌గా ఎవరు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. థాయ్ లాండ్ నుంచి నాగార్జున బిగ్ బాస్ కోసం వస్తారా..? లేక మరొకరిని ఎవర్నైనా హోస్ట్ చేయమంటారా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి.. ఏం చేస్తారో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments