Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరిష్మా కపూర్ ప్రేమలో వుందా.. తండ్రి రణ్ ధీర్ ఏమన్నారంటే?

బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ రెండో వివాహంపై.. ఆమె తండ్రి రణ్ ధీర్ కపూర్ స్పందించారు. కరిష్మాను మళ్లీ పెళ్లిచేసుకోబోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మళ్లీ పెళ్లి చేసుకోమని కరిష్మాకు తాను చెప్పాన

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (11:24 IST)
బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ రెండో వివాహంపై.. ఆమె తండ్రి రణ్ ధీర్ కపూర్ స్పందించారు. కరిష్మాను మళ్లీ  పెళ్లిచేసుకోబోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మళ్లీ పెళ్లి చేసుకోమని కరిష్మాకు తాను చెప్పానని... కానీ, తనకు పెళ్లిపై ఆసక్తి లేదని ఆమె తెలిపిందని చెప్పారు. కరిష్మాకు తన పిల్లలే ప్రపంచమని, ఆమె మరొకరి ప్రేమలో లేదని స్పష్టం చేశారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లడంలో తప్పేముందన్నారు. 
 
కాగా బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ తన భర్త సంజయ్ కపూర్ నుంచి గత ఏడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంజయ్ తన ప్రియురాలు ప్రియను వివాహం చేసుకున్నాడు. మరోవైపు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త సందీప్ తోష్నీవాల్‌తో కరిష్మా ప్రస్తుతం ప్రేమలో ఉందని టాక్. ఈ వార్తలపై రణ్ ధీర్ స్పందిస్తూ.. సందీప్ గురించి తనకు తెలియదన్నారు. 
 
పిల్లలే తన ప్రపంచంగా వారికి మంచి భవిష్యత్తు అందించడమే తన లక్ష్యంగా కరిష్మా కపూర్ వుందన్నారు. ఒకవేళ మరో వ్యక్తితో కలిసి బయటికి వెళ్లాలనుకుంటే నిర్మొహమాటంగా వెళ్లొచ్చు. అందులో తప్పేముంది.. స్నేహితులతో కలిసి బయటికి వెళ్లడం తప్పు కాదు కదా.. ఇప్పటికైతే కరిష్మా తన జీవితాన్ని హాయిగా గడుపుతోంద‌ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments