Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు అరుదైన గౌరవరం... టూస్సాడ్స్‌లో మైనపు ప్రతిమ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవందక్కనుంది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని పెట్టనున్నారనే విషయాన్ని మహేశ్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:52 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవందక్కనుంది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని పెట్టనున్నారనే విషయాన్ని మహేశ్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేసేందుకు వివరాల సేకరణ కోసం టుస్సాడ్స్ ప్రతినిధులు వచ్చినట్టు చెప్పిన మహేశ్ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపాడు.
 
అయితే మహేశ్ మైనపు బొమ్మను ఢిల్లీలో పెడతారా? లేక, బ్యాంకాక్‌లో పెడతారా? అన్న విషయంలో స్పష్టత లేదు. మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న ఒక్కే ఒక్క తెలుగు నటుడు ప్రభాస్ కాగా, ఇప్పుడు మహేశ్ బాబు కూడా ఆ సరసన చేరనున్నాడు. 
 
కాగా, ఇటీవల మహేష్ నటించిన చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పైగా, ఈ చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పుతుండటంతో మహేశ్ పుల్ ఖుషీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వార్త మహేశ్‌ను మరింత ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments