Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పెన హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. మెగా డాటర్‌తో సినిమా

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:44 IST)
ఉప్పెన హీరోయిన్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన సినిమాతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకూ సినిమాలు ఉన్నాయి. 
 
ఇక చర్చల దశలో చాలానే ప్రాజెక్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాని సరసన ఆమె చేసిన 'శ్యామ్ సింగ రాయ్' వచ్చేనెలలో విడుదల కానుంది. బంగార్రాజులో నాగ లక్ష్మిగా కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన కొత్త లుక్ అదుర్స్ అనిపించింది.  
 
తాజాగా మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరించే సినిమాలో కృతి నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. సుస్మిత ఆల్రెడీ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. 
 
ఇకపై ఆ బ్యానర్ పై సినిమాలను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో సన్నాహాలు మొదలుపెట్టింది. నాయిక ప్రధానమైన ఒక కథను ఎంపిక చేసుకున్న ఆమె, ప్రధాన పాత్ర కోసం కృతి శెట్టిని అనుకుందట. 
 
కృతి శెట్టి కథ వినడం .. ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తుందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments