Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినింటికి రావడం ఆనందంగా ఉంది.. కల నెరవేరింది : చిరంజీవి

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (13:41 IST)
చాలా కాలం తర్వాత చెన్నైకు రావడం నటుడుగా పుట్టినింటికి చాలా ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను నటించిన 151 చిత్రం "సైరా నరసింహా రెడ్డి" ప్రమోషన్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇందులో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, 'సైరా' చిత్రం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని, అది వెండితెరపై దృశ్యరూపంగా రావడం అనేది తన కల నెరవేరిందన్నారు. 
 
స్వాతంత్య్ర సమరయోధుడైన 'సైరా నరసింహా రెడ్డి' జీవిత చరిత్రలో నటించాలని 12 ఏళ్లుగా అనుకుంటున్నాం.. ఆ కల ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. కొంత కాలం రాజకీయాలతో బిజీగా ఉండటంతో చిత్రాలకు దూరం కావలసి వచ్చిందనీ, అలాంటిది రామ్‌ చరణ్‌ నటించిన 'మగధీర' చిత్రం విజయం తనలో "సైరా నరసింహారెడ్డి" చిత్రం గురించి ఆలోచన రేపిందన్నారు.
 
రూ.70-80 కోట్ల వ్యయంతో రూపొందిన 'మగధీర' చిత్రం సక్సెస్‌ కావడంతో 'సైరా' చిత్రాన్ని భారీగా చేయవచ్చుననిపించిందన్నారు. ఆ తర్వాత "బాహుబలి 2" చిత్రం 'సైరా' చిత్రం చేయడానికి స్పూర్తినిచ్చిందన్నారు. అప్పుడు చరణ్‌తో సైరా గురించి చర్చించానన్నారు. ఆ తర్వాత రచయితలు పరచూరి బ్రదర్స్‌ సైరా కథను చెక్కడం మొదలెట్టారన్నారు. రాజకీయాలను వదిలి వచ్చిన తర్వాత "ఖైదీ నంబర్‌ 150" చేశాననీ, ఆ చిత్రం చేసేటప్పుడు కాస్త భయపడ్డాననీ, కారణం 10 ఏళ్ల గ్యాప్‌ తర్వాత చేస్తున్న చిత్రం కావడమేనన్నారు.
 
అయితే ఆ చిత్ర విజయం తనలో నమ్మకాన్ని నింపిందన్నారు. కాగా సాధారణంగా తండ్రులు కొడుకులతో చిత్రం చేస్తారనీ, ఇక్కడ తన కొడుకు తనతో చిత్రం చేయడం మంచి అనుభూతిని మిగిల్చిందన్నారు. అదేవిధంగా ఈ సినిమాలో బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌బచ్చన్‌ను నటింపజేశాలని భావించినప్పుడు, ఆయన్ని సంప్రదించగా నటించడానికి అంగీకరించడంతో 'సైరా' విజయంపై నమ్మకం కలిగిందన్నారు. అదేవిధంగా విజయ్‌సేతుపతి, నయనతార, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments