NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

దేవీ
బుధవారం, 26 నవంబరు 2025 (13:41 IST)
NBK 111 poster release
నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం NBK111 చిత్రం నేడు బుధవారంనాడు రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కి సీనియర్ దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు, తేజస్వి స్విచ్చాన్ చేశారు, ఫస్ట్ షాట్ కు బోయపాటి, బాబీ, బుచ్చిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. బాలకృష్ణ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ చిత్రం పేరు ఇంకా నిర్ణయించలేదు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
 
 
నయనతార నాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని పెద్ది సినిమాను రూపొందిస్తున్న వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సినిమా థీమ్‌ను ఉద్దేశించి విడుదలచేసిన బాల‌య్య క్యారెక్ట‌ర్ ను ఎలివేట్ చేస్తూ ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన పోస్ట‌ర్లు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ చిత్రం మరో స్థాయిలో వుంటుందని దర్శకుడు చెబుతున్నాడు. సమాచారం మేరకు ఈ చిత్రానికి మ‌హా రాజు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments