Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్యన్‌కు రిమాండ్ పొడగింపు - బెయిల్ కోసం బాంబే హైకోర్టుకు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (18:50 IST)
క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో పట్టుబడిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు స్థానిక కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఆయనకు ఈ నెల 30 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన ఈ నెల 3వ తేదీన అరెస్టు అయ్యాడు. ఓ క్రూయిజ్ షిప్పులో జరుగుతున్న రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకంపై సమాచారంతో ముంబై పోలీసులతో కలిసి నార్కోటిక్స్ విభాగం అధికారులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. 
 
ప్రస్తుతం ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ, బెయిల్ లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్యన్‌ రిమాండ్‌ను 14 రోజుల పాటు పొడగించడంతో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఇక, డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి అనన్య పాండేకి చెందిన ఫోన్, ల్యాప్ టాప్‌ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆమెను గురువారం విచారణకు పిలిచిన విషయం తెల్సిందే. ఈమె విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments