Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం కోసం జోలె పట్టిన రారాజు కథ : ఎన్టీఆర్ బయోపిక్ రేపే విడుదల

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (11:43 IST)
స్వర్గీయ ఎన్.టి. రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకురానుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. జనం కోసం జోలె పట్టిన రారాజు కథ జనవరి 9వ తేదీన రిలీజ్ అంటూ అందులో పేర్కొంది. 
 
ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు హీరో నందమూరి బాలకృష్ణ నటించారు. ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్ నటించగా, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. అలాగే, ఏఎన్నార్ పాత్రలో సుమంత్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, ఇలా అనేక సీనియర్ నటుల పాత్రల్లో యువ నటీనటులు నటించారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చారు.
 
ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. 'య‌మ‌గోల' చిత్రంలో ట చిల‌క కొట్టుడు కొడితే చిన్న‌దానా..' సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌ని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో వాడుతున్నారు. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌గా హ‌న్సిక ఆ సాంగ్‌కి స్టెప్పులేయ‌నున్నారు. తాజాగా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానులని ఆక‌ట్టుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments