Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ట్రైలర్‌కే .. ఇక 'బొమ్మ'పడితే... "వకీల్ సాబ్"కు ఫ్యాన్స్ బ్రహ్మరథం

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:09 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. ఈ చిత్రం ట్రైలర్ సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్‌కే ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. 
 
వకీల్ సాబ్ చిత్రంలో న్యాయవాది పాత్రలో ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్' నుంచి ట్రైలర్ నిన్న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు చేసిన హంగామా, జ‌రుపుకున్న వేడుక‌ల‌ను సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.
 
విశాఖప‌ట్నంలోని ఓ థియేట‌ర్‌లో ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా అభిమానులు ఎగ‌బ‌డుతూ థియేట‌ర్‌లోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో థియేటర్ ప్రవేశద్వారం వద్ద ఉన్న అద్దం పగిలిపోవడంతో కొంద‌రు కింద‌ప‌డిపోయారు. 
 
విశాఖ‌లోని మ‌రో ప్రాంతంలో 108 కొబ్బ‌రి కాయ‌లు కొట్టారు. పాల‌కొల్లులో అభిమానులంతా ఒక్క చోట చేరీ నానా హ‌డావుడి చేశారు. థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ విడుద‌లైన స‌మ‌యంలో ప్రేక్ష‌కులంతా నిల‌బ‌డి డ్యాన్సులు చేస్తూ, కాగితాలు ఎగ‌రేస్తూ అంబ‌రాన్నంటే సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. కేవ‌లం ట్రైల‌ర్‌కే ప‌వ‌న్ అభిమానులు ఇంత హ‌డావుడి చేస్తే, ఇక సినిమా విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ మొదైంది. 
 
కాగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వ‌కీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటించింది. న్యాయ‌వాదిగా ప్రకాశ్ రాజ్, కీల‌క పాత్ర‌ల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల న‌టించారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  దిల్ రాజ్,   శిరీష్ నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments