Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (15:49 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప-2' మూవీ. గత యేడాది డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన రోజు తొలి ఆట నుంచి సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, పాత రికార్డులను తిరగరాస్తూ వస్తుంది. అయితే, ఈ చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిప్రకాష్, సుకుమార్ గృహాల్లో ఐటీ అధికారులు గత రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో "పుష్ప-2" చిత్రం వసూళ్ళకు తగిన విధంగా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, ఈ చిత్రం కోసం ఖర్చు చేసిన బడ్జెట్, వచ్చిన కలెక్షన్లు వంటి అంశాలపై దృష్టిసారించారు. 
 
ఇప్పటివరకు 'పుష్ప-2' మూవీ రూ.1700 కోట్లకుపైగా వసూలు చేసినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, వచ్చిన ఆదాయం ఎంతో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారుగా 55 మంది ఐటీ అధికారుల బృందం ఈ తనిఖీల్లో నిమగ్నమైవున్నారు. 
 
కాగా, తొలుత ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన గృహాలు, ఆఫీసుల్లో తనిఖీలకు ప్రారంభించిన ఐటీ అధికారులు గత రెండు రోజులుగా చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాతలు, ఫైనాన్షియర్లు, పంపిణీదారుల నివాసాల్లో సోదాలు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments