Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రోడా నీ తాట తీయనీకి వస్తున్నా : కేసీఆర్ బయోపిక్ సాంగ్ రిలీజ్

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (12:13 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్ఘకాలం తర్వాత ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో మంచి విజయాన్ని రుచిచూశాడు. ఇదే ఊపుతో ఇపుడు కేసీఆర్ బయోపిక్‌ను తెరకెక్కంచనున్నాడు. 
 
ఈ క్రమంలోనే తాజాగా కేసిఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అంతేకాదు వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. "భాష మీద నవ్వినవ్.. ముఖాల మీద ఊసినవ్.. మా బాడీల మీద నడిచినవ్.. వస్తున్నా.. ఆంధ్రోడా నీ తాట తీయనీకి వస్తున్నా" అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియాలో వర్మ రిలీజ్ చేశారు. 
 
ఈ సాంగ్‌లో అనేక వివాదాస్పద మాటలు ఉండగా.. సినిమాలో ఎవరెవరి పాత్రలు ఉండబోతున్నాయనే విషయాన్ని వెల్లడించారు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్‌లో కనిపించనున్నారు. కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌, కూతురు కవిత, అల్లుడు హరీష్‌ రావు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రోశయ్య, కిరణ్ కుమార్‌ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా సినిమాలో ఉంటుందని వర్మ ప్రకటించాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments