Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం కేసు ఓ పీడకల... అందాలతో మెస్మరైజ్ చేస్తున్న శ్వేతాబసు ప్రసాద్

శ్వేతాబసు ప్రసాద్. ఒకనాటి టాలీవుడ్ హీరోయిన్. వెండితెరపై అగుడుపెట్టగానే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ. బాలనటిగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్.. ఈ అమ్మడు తెలుగులో ఎం

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (13:53 IST)
శ్వేతాబసు ప్రసాద్. ఒకనాటి టాలీవుడ్ హీరోయిన్. వెండితెరపై అగుడుపెట్టగానే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ. బాలనటిగా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్.. ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ సినిమా 'కొత్తబంగారులోకం'తోనే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత నటించిన 'రైడ్' సినిమాతోనూ సక్సెస్‌ను చవిచూసింది. 
 
ఆ తర్వాత ఈమెకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అమ్మడి కెరీర్ ఇక ముగిసిపోయినట్టే అనుకున్నారంతా. వ్యభిచారం కేసులో అరెస్టు అయింది. ఆ తర్వాత కేసును కోర్టు కొట్టేయడంతో ముంబైకెళ్లి సెటిలైపోయింది. అక్కడకు వెళ్లాక ఖాళీగా కూర్చోలేదు. 
 
తనకున్న పరిచయాలతో హిందీలో రూపొందుతోన్న హిస్టారికల్ సీరియల్ 'చంద్రనందిని'లో ఏకంగా లీడ్ రోల్ చేసే ఛాన్స్ కొట్టేసింది. సీరియల్‌తో పాటు బాలీవుడ్‌లో రూపొందిన బడా మూవీ.. 'బద్రీనాథ్‌కి దుల్హానియా'లోనూ స్మాల్ రోల్‌లో నటించిన శ్వేత ఇప్పుడు తెలుగులపై ఫోకస్ పెడుతోందట.
 
అందుకే ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ లుక్ చూసి అంతా కంగుతిన్నారు. మెరుపుతీగలా తయారైన తన అందాలతో.. అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. హైదరాబాద్‌లో ఉన్నప్పడు లావుగా ఉన్న ఈ భామ ఇపుడు సన్నగా తయారై మెరుపుతీగలా ఉంది. సో.. టాలీవుడ్‌లో ఛాన్సులు వస్తాయో లేద వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments