Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జనసందోహం... అదో మార్కెటింగ్ ట్రిక్ : హీరో సిద్దార్థ్

ఠాగూర్
బుధవారం, 11 డిశెంబరు 2024 (10:51 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా జరిగిన 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా అభిమానులు తరలిరావడం, అదీకూడా ఓ తెలుగు హీరో నటించిన చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ పాట్నాలో విజయవంతంగా నిర్వహించడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఈవెంట్‌కు వచ్చిన జనసందోహంపై కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన తాజా చిత్రం "మిస్ యూ" చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. 
 
బీహార్‌లోని పాట్నాలో 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రేక్షకులు కేవలం మార్కెటింగ్ మాత్రమే. అది పెద్ద విషయం కాదు. రోడ్డుపై జేసీపీ వర్క్ చేస్తున్నా కూడా ఎక్కువ మంది గుమికూడుతారన్నారు. 
 
బీహార్ లాంటి చోట అంత క్రౌడ్ రావడం పెద్ద మ్యాటర్ కాదన్నారు. పెద్ద మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్‌ను నిర్వహిస్తే ప్రజలు గుమికూడుతారని అన్నాడు. ఒక్క బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ ఇస్తే రాజకీయ నాయకులక మీటింగ్‌కు జనాలు విపరీతంగా వస్తారని, అలా అని రాజకీయ పార్టీలు గెలుస్తాయా? అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
తమ హీరోను ఉద్దేశించి సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నోటి దురుసుతనం వల్లే ఒకపుడు టాప్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ సినిమాలు ఇపుడు చూసే వారు లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

Jagan: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్మోహన్ రెడ్డి.. క్రిమినల్ కేసు పెట్టడం?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments