Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి పెంపుడు తండ్రి ఇంత పనిచేశాడా? ప్రేమ పేరుతో లోబరుచుకుని..?

బాహుబలిలో ప్రభాస్‌కు పెంపుడు తండ్రిగా, గరుడవేగలో సీఎం పీఏ నటించిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్, సినీ నటుడు వెంకట ప్రసాద్ (ఐమ్యాక్స్ వెంకట్) అరెస్టయ్యాడు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో అతనిని పోల

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (13:19 IST)
బాహుబలిలో ప్రభాస్‌కు పెంపుడు తండ్రిగా, గరుడవేగలో సీఎం పీఏ నటించిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్, సినీ నటుడు వెంకట ప్రసాద్ (ఐమ్యాక్స్ వెంకట్) అరెస్టయ్యాడు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ పదిలో నివాసముండే ఓ మహిళ (33) ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పనిచేస్తోంది.
 
పది సంవత్సరాల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె.. విడాకుల కోసం ఆమె దాఖలు చేసిన కేసు కోర్టులోనడుస్తోంది. ఆ మహిళపై కన్నేసిన వెంకటప్రసాద్ ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో గత ఏడేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు.
 
ఈ క్రమంలో ప్రసాద్ సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకున్నాడు. ఇంతలో బాధిత మహిళకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. వెంకట ప్రసాద్‌ను వివాహం చేసుకోవాలని మహిళ ఒత్తిడి తేవడంతో ముఖం చాటేశాడు. అంతేగాకుండా వేరొక యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అతడు అనేకమంది యువతులను ప్రేమ పేరిట మోసం చేసినట్లు తేలింది. దీంతో 420, 506,509, 354(డి) కింద కేసులు నమోదు చేసి వెంకట్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments