Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కొలవెరి''ని పక్కనబెట్టేసిన ''ఫిదా'' సాయిపల్లవి.. ఎలా? (వీడియో)

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:02 IST)
ప్రపంచ వ్యాప్తంగా ''కొలవెరి'' పాట వైరల్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత సారథ్యంలో.. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, సినీ హీరో ధనుష్ పాడిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. అలా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. అత్యధిక వ్యూస్, షేర్స్, లైక్స్‌ను కొల్లగొట్టింది. 
 
ఆరేళ్ల క్రితం ''వై దిస్ కొలవెరి డి'' అంటూ సాగిన ధనుష్ పాట దక్షిణాదిన హిట్ కొట్టిన పాటగా యూట్యూబ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 172 మిలియన్ వ్యూస్‌తో పాటు 1.4 మిలియన్ లైక్స్ సంపాదించింది. అలాంటి హిట్ పాటను ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి వెనక్కి నెట్టింది. తెలుగులో ''ఫిదా'' సినిమా పాట ద్వారా కొలవెరిని పక్కనబెట్టేసింది.
 
వరుజ్ తేజ్, సాయిపల్లవి జంటగా, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ''ఫిదా'' సినిమాలోని ''వచ్చిండే'' పాట బంపర్ హిట్ అయ్యింది. ఈ పాట..173 మిలియన్స వ్యూస్‌‌తో పాటు 418కె లైక్స్ సంపాదించింది. తద్వారా ఇప్పటి వరకు దక్షిణాదిన అత్యధిక వ్యూస్ సంపాదించిన కొలవెరి పాటను ఫిదా పాట వెనక్కి నెట్టింది. ఇక వచ్చిండే పాటకు శక్తికాంత్ కార్తిక్ సంగీతం సమకూర్చాడు. 
 
మధుప్రియ గాత్రం ఇచ్చింది. ఇంకా ఇందులో సాయిపల్లవి డ్యాన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిండే పాట ఫిదా హిట్‌లో కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments