బ్రెడ్ ఉప్మా తయారీ విధానం...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (11:36 IST)
చాలామంది బ్రెడ్‌తో శాండ్ విజ్, గారలు వంటి వంటకాలు తయారుచేస్తుంటారు. ఇంకా రకరకాల వంటకాలు చేస్తుంటారు. కొందరికి ఉప్మా అంటేనే నచ్చదు. మరి బ్రెడ్‌తో ఉప్మా చేస్తే నచ్చని వారు కూడా ఉప్మా కావాలని అడుతారు. మరి ఈ బ్రెడ్‌తో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెన్ - 4
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 1
బీన్స్ - 5
పచ్చి బఠాణీ - అరకప్పు
అల్లం పేస్ట్ - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - అరస్పూన్
నిమ్మకాయ - 1
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 3 నిమిషాల పాటు వేయించి క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ కొద్దిగా పసుపు వేసి కలుపుకుని కాసేపటి తరువాత బ్రెడ్ ముక్కలు వేసి 5  నిమిషాల పాటు అలానే ఉంచాలి. చివరగా ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి కలుపుకుంటే వేడివేడి బ్రెడ్ ఉప్మా రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

నేతలెవ్వరూ గాంధీ భవన్ వైపు రావొద్దంటున్న సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments