Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు ఊడిపోతుందా? ఐతే ఈ చిట్కాలు పాటించండి...

చాలామంది చర్మానికి, ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతను జుట్టందానికి ఇవ్వరు. కొందరు తరచుగా షాంపూలను మారుస్తుంటారు. మార్కెట్లో దొరికే హెయిర్‌ ఆయిల్స్‌ను వాడుతుంటారు. ఎలా చేసినా వారి జుట్టు చుండ్రుతోనో.. మరేదో సమస్యతోనో ఊడిపోతుంటుంది. ఆడవారు ఎంత అందంగా ఉన్నా..

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (21:34 IST)
చాలామంది చర్మానికి, ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతను జుట్టందానికి ఇవ్వరు. కొందరు తరచుగా షాంపూలను మారుస్తుంటారు. మార్కెట్లో దొరికే హెయిర్‌ ఆయిల్స్‌ను వాడుతుంటారు. ఎలా చేసినా వారి జుట్టు చుండ్రుతోనో.. మరేదో సమస్యతోనో ఊడిపోతుంటుంది. ఆడవారు ఎంత అందంగా ఉన్నా... జుట్టు అందంతో వారికి మరింత అందం పెరుగుతుంది. కొన్ని రకాల జాగ్రత్తలతో జుట్టును ఒత్తుగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు. 
 
బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి. 
 
250 గ్రాముల మజ్జిగ, పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్ధన చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది.
 
మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిలవచేసుకుని ప్రతిరోజూ రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. గోరింటాకు ఎండబెట్టి పొడిగా చేసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి. 
 
పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. మార్కెట్లో దొరికే కలర్‌ డైలను ఎక్కువగా వాడకూడదు. సాధ్యమైనంత వరకూ సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో మెహిందీ పొడి దొరుకుతుంది. దానితో సహజసిద్ధమైన డైని తయారుచేసుకుంటే మంచిది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవు. 
 
ఉసిరికపొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పెద్ద ఉసిరికాయలు (ఆమ్లా) చౌకగా లభ్యమయ్యేకాలంలో వాటిని తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని... వాటిని తలకు పట్టిస్తే చుండ్రు, పేలు నివారణ అవుతాయి. మార్కెట్లో లభ్యం అయ్యే చౌకరకాల షాంపూలను, సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు : హోం మంత్రి అనిత

వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక పరిణామం : సెక్షన్లు మార్చనున్న పోలీసులు

జెన్ జీ మన పిల్లలే ... పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదు : ధర్మేంద్ర ప్రధాన్

జగన్ శిష్యులం... ఆయన కోసం ఎంతకైనా తెగిస్తాం : వైకాపా నేత చింతాడ

సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారు.. మనస్తాపంతో బలవన్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments