Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (08:42 IST)
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాల దంపతులు త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శోభిత గర్భంతో ఉన్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అందుకు తగినట్టుగానే ఆమె ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ - 2025 సమ్మిట్‌లో శోభిత ధూళిపాల వదులుగా ఉండే చీరను ధరించారు. దీంతో శోభిత గర్భందాల్చిన మాట నిజమేనంటూ అనేక మంది నమ్మేశారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై శోభిత టీమ్ స్పందించింది. 
 
ఆ గుడ్ న్యూస్ కేవలం ఒక పుకారు మాత్రమే. శోభిత వ్యక్తిగత జీవితం గురించి వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుందని, మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె టీమ్  స్పష్టం చేసింది. 
 
అలాగే, శోభిత వదులుగా ఉండే చీర ధరించడంపై కూడా ఆ టీమ్ స్పందించింది. అది మెటర్నిటీ డ్రెస్ కాదని, యాంటీ ఫిట్ డ్రెస్ అని సెలవిచ్చింది. కేవలం వస్త్రాధారణ వల్ల ఇలాంటి రూమర్స్ రావడం ఆశ్చర్యంగా ఉందంటూ క్లారిటీ ఇచ్చింది. కాగా, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాటి గర్భందాల్చిన విషయం తెల్సిందే. దీంతో శోభిత కూడా గర్భందాల్చినట్టు వార్తలు రావడంతో ఆమె బృందం క్లారిటీ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments